ఎవరు ఏ లింగాలని పూజించాలి? వాటి ఫలితం ?

0


ఏ మాసంలో ఏ లింగాన్ని ?
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి. స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రి విషయానికి వస్తే, భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాన్ని, భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాన్ని కాని అర్చిస్తే మంచిదని లింగపురాణం చెబుతోంది. స్త్రి లలో అన్ని వయస్సుల వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.
ఏలింగాన్ని పూజచేస్తే ఏం ఫలితం?
ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦, వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది. అన్నిటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహ లింగం .
అతి పవిత్ర బాణలింగం
అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి.
రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.
స్థాపర, జంగమ లింగాలు :
జగత్తంతా శివమయం, అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరూపమైనప్పుడు, సృష్టి స్థితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు, చెట్లు ( మొదలైనవి) జంగమాలు(కదిలేవిమనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి)కూడా లింగరూపాలే అవుతాయి. వీటికి స్తావరలింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా శివపుజలోకే వస్తుంది.

లింగ పూజ చేసేవారు ఉత్తరముఖంగా కూర్చోవాలని, రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.

Leave A Reply