గోమాత సేవ – ప్రాశస్త్యం !!

8
ఈ వ్యాసం చదివి గోసేవ పై రుచి కలిగిన వారు గోసేవ గురించి కొంత ప్రయత్నం చేసినట్లయితే మీ అనుభవాలను పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే మీ ఫేస్ బుక్ పేజ్ లో కూడా దీన్ని షేర్ చేసి మీ స్నేహితులకు కూడా అవగాహన కల్గించండి.

గోమాత ప్రాశస్త్యం గురించి, ప్రభావం గురించి మన పురాణేతిహాసాల్లో అసంఖ్యాకమైన కథలు వున్నాయి. కల్పాల ప్రారంభంలోని కామధేనువు నుంచి, కృత యుగంలో గురు దత్తాత్రేయుల వారి వెంటా, ద్వాపరంలో శ్రీ కృష్ణ భగవానుని వెంటా వున్న గోవుల నుంచి, ఆధునిక కాలంలో సైతం, గో సేవ ఫలితం గురించి, వైశిష్ట్యం గురించి ఎన్నో ఆఖ్యానాలు వున్నాయి. ఆధునిక కాలంలో జీవనశైలి వల్ల గో సన్నిధికి మనం బాగా దూరం అయి ఉండవచ్చు కానీ, మన పూర్వీకులంతా పాడి పశువుల సంపద ఆధారంగానే సిరిసంపదలను అంచనా వేసేవారు.

పూర్వ౦ గోసంపద అధికంగా వున్న కాలంలో గవ్య పదార్ధాలు – అంటే గోవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, గోపంచితం, పేడ వంటివి విస్తృతంగా వాడే వారు. అందువల్ల ప్రజలందరికీ మంచి పుష్టికరమైన భోజనం, సుఖశాంతులూ, పాడిపంటలు సమృద్ధిగా అందుబాటులో ఉండేవి. వారు కూడా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా వుండే వారు. వయసు మీరినా మంచి ఆరోగ్యం, చురుకుదనం కలిగి వుండే వారు.

ఆధునిక పోకడలకు లోనై ఆవు పాలకు బదులుగా గేదె పాలు వాడడం మొదలు పెట్టి, గోవు మన జీవన విధానానికి దూరమైన దగ్గర నుంచి తర తరానికి కూడా ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదల్లో బాగా వ్యత్యాసం వచ్చింది. గోసంరక్షణ తగ్గుముఖం పట్టిన ఫలితంగా దేశంలో అశాంతి, దుఃఖ దారిద్ర్యాలు పెచ్చుమీరాయి.

ఈనాటికీ మనం ఇన్ని జీవాల పోషణ చేస్తుండగా – ఒక్క గోవుకే ఇంత ప్రాముఖ్యమా అన్న సందేహమూ ఆధునికులకు రావచ్చు. శరీర నిర్మాణంతో సహా గోవు మహిష జాతి పశువుల కన్నా మరింత ఉత్కృష్టమైనదని మన వాంగ్మయం వల్లా పెద్దల వల్లా తెలుస్తోంది. ఎన్నో శాస్త్ర పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. దేశీ గోవు మూపు లో ఉండే ఒక విధమైన నాడి సూర్య శక్తిని ఆకర్షించి తన పాల ద్వారా మానవ జాతికి కూడా మేలు చేస్తుందన్నది కూడా శాస్త్రీయంగా నిరూపితమైంది. గేదె పాల కన్నా ఆవు పాలు చాలా పుష్టికరమైనవి, ఆరోగ్యదాయకమైనవి అన్న విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది. ఒక్క పాలే కాకుండా, గోసంపద మీద ఆధారపడి ఒక స్వయం సమృద్ధమైన గ్రామీణ ఆర్ధిక ప్రణాళిక కు రూపకల్పన చేయవచ్చని కూడా నిరూపితమైంది. ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్న ఇలాంటి గ్రామాలు ఈరోజుల్లో కూడా అక్కడక్కడా కనపడుతూనే వున్నాయి.

కొన్ని రోగాలు కూడా గోధూళి వల్లా, గో సేవనం వల్లా, గోవులకు అత్యంత సమీపంలో వుండడం వల్లా కూడా నయం అవుతాయనేది అనుభవైకవెద్యమైన సత్యం. ఒక్క ఆరోగ్యానికే కాక, ఈలోకంలో సుఖ సంపదలు, ఆరోగ్యం, ఆనందాలకు, అలాగే ఆముష్మికమైన పారమార్ధికమైన జ్ఞానానికి కూడా గోసేవ దోహదం చేస్తుందనేది పెద్దల మాట.

గోసేవ గురించిన కేవల కల్పిత కథలే కాక ఎన్నో నిజ జీవిత దృష్టాంతాలు కూడా వున్నాయి. మీ వూళ్ళో గోశాలను దర్శించి మీకు తోచిన సేవ చేసి మీకు మీరే ఈ విషయాన్ని రుజువు చేసుకోవచ్చు. అంతకన్నా ముందు గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారు ప్రచురించిన “గోసేవ – దాని ఫలము” (పుస్తకం నెంబర్ 969) చదివితే అసలు ఎన్ని రకాల ఫలితాలు నిజ జీవితంలో చవి చూడవచ్చో తెలుస్తుంది.

Discussion8 Comments

  1. Pingback: videoreview ecom shop

  2. Pingback: Free UK Chat

  3. Pingback: ceramicadecasa.com

  4. Pingback: รับทำเว็บไซต์

  5. Pingback: Income Tax Services

  6. Pingback: Funny dog and cat animal videos

  7. Pingback: informatii diverse

Leave A Reply