కొల్లూరు మూకాంబిక ఆలయం, కర్ణాటక !!

4
కొల్లూరు లోని మూకాంబిక ఆలయం 1200 సంవత్సరాల పురాతనమైన ఆలయం! ఈ ఆలయ ధ్వజస్థంభం ఇప్పటికీ చెక్కుచెదరలేదు.. తుప్పు పట్టలేదు!!

కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరులో మూకాంబికా క్షేత్రం ఉంది. ఆలయానికి కనీసం 1200 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయ ధ్వజస్థంభం ఇనుముతో చేసింది.. కానీ ఇప్పటి వరకు ఎటువంటి తుప్పు దీనికి రాకపోవడం.. అధ్బుతం.. పశ్చిమ కనుమలకు సమీపంలో ఉన్న ఈ ఆలయం దగ్గర వర్షపాతం కూడా ఎక్కువే.. అయినా ఎటువంటి తుప్పు మరకలు ఈ ధ్వజస్థంభం మీద మనకు కనపడవు… 

ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాలలో కొల్లూరు ఒకటి. మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గొకర్ణ క్షేత్రాలు. కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షం అయ్యారట. ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట. అలా వెళ్తుండగా స్వామి వారు ఈ ప్రదేశంలో వెనక్కి తిరిగి అమ్మవారు వస్తున్నారా లేదా అని చూడడంతో – అమ్మవారు ఇక్కడే ఉండిపోయారని ఇక్కడి ఇతిహాసం చెప్తోంది.

మూకాంబిక సరస్వతి మహాకాళి, శక్తిలా సంయుక్త స్వరూపంగా భావిస్తారు. ఎందరో రాజుల మన్నన పొందిన ఈ ఆలయం ముష్కర తురుష్క పాలనలో దోపిడీకి గురైంది. ఇక్కడి కోట్లాదిరూపాయలు విలువచేసే అమూల్య సంపద అంతా దోచుకోబడింది.

శివుని వరం పొందిన కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించే వాడు. సప్తర్షులు వీడి పీడ ఎలా విరగడ అవుతుందా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని శుక్రాచార్యుడు వాడి చెవిన వేసి, వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది. మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని ‘’మూకాసురుడు’’ అన్నారు.
అప్పుడు కోల రుషిఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిగా సృష్టించింది. ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది. మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని మారణ కట్టేఅంటారు(మరణ గద్దె). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర వెలసిల్లమని కోరుకొన్నాడు. వాడి కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది. ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.

మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగల వారై సంపన్నులు అవుతారని ప్రతీతి. మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసే “పంచకడ్జాయంఅనే ప్రసాదం పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత, ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కుని ఆ ప్రసాదాన్ని తిన్నాడట. అమ్మవారికి నివేదించిన ప్రసాదం తిన్నందువల్ల అతడు మహాపండితుడు అయ్యాడని అంటారు. అందుచేత కేరళ ప్రజల్లో కూడా అమ్మవారిపై అపార విశ్వాసం. ప్రతిరోజూ ఈ ఆలయంలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాలు భక్తుల విశ్వాసానికి నిదర్శనం.

Discussion4 Comments

  1. Pingback: lean testosterone booster max review

  2. Pingback: IG porn

  3. Pingback: Funny dog and cat animal videos

  4. Pingback: Dentist in Pittsburgh PA (412) 219-4579 North Hills Family Dental

Leave A Reply