ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్య స్నానం

0

ఆర్యోగ్య సాధన కోసం ప్రతి ఒక్కరు ఉదయం 6.30 నుండి 7.30 వరకు సూర్యరశ్మిలో కూర్చోవడం కాని, నడవడం కాని మంచిదని వైద్యుల సలహా. 
సూర్యుని ప్రధాన కిరణాలు 7.  అవి మానవ దేహం పై గొప్ప ప్రభావం చూపుతాయి. 
1. ఆదిత్యుని సప్త రాసులలో మొదటిది “సుషుమ్నము“. నాడి మండలాన్ని ఉత్తేజ పరుస్తుంది. తద్వారా నాడులు చురుగ్గా పని చేస్తాయి. అందువలన పక్షవాతం రాదు. 
2. రెండవది “హరికేశము“. ఇది గుండె కవాటాల పై ప్రభావం చూపి, వాటిలో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. తద్వారా గుండె జబ్బులు రావు. 
3. మూడవది “విశ్వకర్మము“. ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాల పై ప్రభావం చూపి దేహంలో ఐరన్ శాతం పెరిగేలా చూస్తుంది. తద్వారా రక్త సంబంధమైన రుగ్మతలు నివారింపబడతాయి. 
4. నాలుగవది “విశ్వవ్యచము“. ఇది శరీరంలోని చర్మం పైన పని చేసి చర్మ వ్యాధులను రాకుండా చేస్తుంది. అంతే కాకుండా ఊపిరితిత్తుల పైన పని చేసి క్షయ వ్యాధి రాకుండా కాపాడుతుంది. 
5. అయిదవది “సంపద్వసము“. జననేంద్రియ వ్యవస్థను జీర్నకోశాన్ని బలోపేతం చేస్తుంది. తద్వారా పుంసత్వము కలుగుతుంది. స్త్రీలలో వ్యంధత్వ దోషాన్ని నివారిస్తుంది. 
6. ఇక ఆరవది “అర్వాగ్వసము“. ఇది దేహంలోని కండర కణజాలు మీద ప్రభావం చూపి బలహీనతను దూరం చేస్తుంది. 
7. ఏడవదైన “స్వరాడ్వసుము“. ఇది మూత్ర వ్యవస్థ, స్వర పేటిక పై పని చేసే కఫ, మూత్ర సంబంధమైన వ్యాధులను రానివ్వకుండా చేస్తుంది. 
అందువలన పరిపూర్ణ ఆరోగ్యం కోసం అందరు “సూర్య(కిరణ- రశ్మి) స్నానం” చేయడం శ్రేయస్కరం. 

 

 

Leave A Reply