దైవానికి ఎదుట నిలబడి నమస్కరించావచ్చా

0 54
గుడిలో మనం పూజించే దైవానికి ఎదురుగా నిలబడి నమస్కరించడం మంచిది కాదని మన పెద్దలు చెబుతారు .దైవం ముందు లోకం అంత చిన్నదే .ఇక కోట్లాను కొట్లలో  మనం స్థాయి అంత్యంత అల్పమైనది.అందుకే దైవం ఎదురు నిలబడి నమస్కరించకూడదని మన పెద్దలు అన్నారు .
మరి దైవానికి నమస్కరించే పద్ధతి ఏంటి ?
దేవుడి విగ్రహానికి కుడి వైపున పూజారి వుండి పూజలు నిర్వహిస్తూ ఉంటాడు .ప్రదక్షిణ విధానముగా దేవునికి పూజ ద్రవ్యాలు సమర్పిస్తూ హారతి పడతాడు.ఈ కార్యక్రమం పూజారి దేవునికి కుడి వైపున వునప్పుడే సాధ్యం.ఈ సమయం లో భక్తులు దేవునికి ఎడమ పక్కన ఉండాలి.అలా వుండడం వాళ్ళ వారికి పూజారి చేసే కార్యక్రమాలు అన్ని కూడా స్పష్టంగా కనపడతాయి.అంతే కాకుండా దేవుడి తక్కువ ఎత్తులో వుండి మీరు ఆయన ఎదురుగా నిలబడితే మీ చూపు ఆయన కాళ్ళ మీద పడదు , అలాంటప్పుడు కొంచెం పక్కకి  నుంచుని నమస్కరించడం వల్ల మీకు ఆయన పాద దర్సనం కలుగుతుంది.అదే ఆయన ఎత్తులో వుండి మీరు గనుక ఎదురుగా వుండి నమస్కరిస్తే ఆ దేవుని చరణాల మీదా మీ దృష్టి పడ్తుంది .

 

Leave A Reply

Your email address will not be published.