కనుమ పండుగ ప్రత్యేకత

4

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను … ఆప్యాతానురాగాలను … పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పెద్ద పండుగలో, భోగి .. సంక్రాంతి తరువాత రోజున ‘కనుమ’ పండుగ పలకరిస్తుంది. పల్లె జీవన విధానాన్ని … పశువులతో .. పంటలతో అక్కడి వారికి గల అనుబంధాన్ని ఈ పెద్ద పండుగ అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.
భోగి … సంక్రాంతి రోజుల్లో పాలు … ధాన్యాలతో తయారు చేసిన వంటలను దైవానికి నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక మూడవ రోజైన ‘కనుమ’ పండుగ రోజున పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. పల్లె జీవన విధానంలో పాడి విషయంలో ఆవులు…వ్యవసాయం విషయంలో ఎద్దులు గ్రామస్తులకు ఎంతగానో తోడ్పడుతుంటాయి.
తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తోన్న పాత్రను వాళ్లు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు.
ఆ పశువుల నుదుటున కుంకుమ దిద్ది .. వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపు పై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు.

Discussion4 Comments

  1. Pingback: vivo research

  2. Pingback: portronics soundpot

  3. You could definitely see your enthusiasm in the work you write. The world hopes for even more passionate writers like you who aren’t afraid to say how they believe. Always go after your heart.

  4. Pingback: cpasbien torrent9 de telechargement

Leave A Reply