తరిగొండ వెంగమాంబ 

0

మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే .. కొంతమంది అంతకుముందు భగవంతుడి విషయంలో పెద్దగా దృష్టి పెట్టనట్లుగా కనిపిస్తారు. ఆ తరువాత అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటల కారణంగా వాళ్లు భగవంతుడి పాదాలను ఆశ్రయించి, ఆ స్వామి సేవకే జీవితాన్ని అంకితం చేశారు.
మరికొంత మంది బాల్యం నుంచే భగవంతుడి పట్ల భక్తిశ్రద్ధలను కనబరుస్తూ వచ్చారు. భగవంతుడి దర్శనం .. ఆయన నామస్మరణం .. ఆయన ధ్యానానికి తప్ప వాళ్లు మరి దేనికీ ప్రాధాన్యతను ఇవ్వలేదు. అలాంటివారిలో తరిగొండ వెంగమాంబ ఒకరుగా కనిపిస్తుంది.
చిన్నప్పటి నుంచి కూడా తులసి చెట్టుకి ప్రదక్షిణలు చేయడానికి ఆమె బాగా ఇష్టపడేదట. ఇక స్వామి పూజకు పూలు కోయడానికి ఆమె పడే ఆనందం అంతా ఇంతా కాదు. వేంకటేశ్వరస్వామికి పూల మాలలు అంటే ఇష్టమని తెలిసి, ఆసక్తితో పూల మాలలు అల్లడం నేర్చుకుంది. ఆ తరువాత కాలంలో పూల మాలలు కట్టడంలో, వెంగమాంబతో పోటీపడేవాళ్లు లేరనిపించుకుంది. ఆలయానికి వెళ్లినా .. పూజా మందిరం చెంత కూర్చున్నా ఆమె పరవశించి పాటలు పాడుతూ .. ఆ భగవంతుడి ధ్యానంలో నిమగ్నమైపోయేది.
ఎవరు పిలిచినా వెంటనే మనలోకి వచ్చేది కాదు. అలా వెంగమాంబకి వయసుతో పాటు భక్తి శ్రద్ధలు పెరుగుతూ వచ్చాయి. ఎలాంటి పరిస్థితిలు ఎదురైనా ఆ శ్రీనివాసుడి పాదసేవను విడవకుండా ఆమె ఆయనలో ఐక్యమైపోయింది. తిరుమలలో వెంగమాంబ అన్నదాన సత్రాన్ని చూస్తే .. భక్తులను ఆమె ఆత్మీయంగా భోజనానికి ఆహ్వానిస్త్తున్నట్టుగానే వుంటుంది. తిరుమాలలో అయ్యవారినీ .. అమ్మవారినీ .. వారిని సేవించిన భక్తులని తలచుకుంటే చాలు జన్మధన్యమై పోతుంది.

Leave A Reply