ఆపదలను తొలగించే ఆదిదేవుడు

4

పరమశివుడు .. భక్తులు కొలిచినంతనే కరిగిపోతాడు .. పిలిచినంతనే పరిగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు .. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో ‘కీతవారి గూడెం’ ఒకటి. ఇది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పరిథిలో దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆపదలో పడినవాళ్లు ఆ స్వామిని మనసులో తలచుకున్నంతనే బయటపడతారని చెప్పుకుంటూ వుంటారు.
ఆలయ ప్రాంగణంలో ఒక వైపున శివుడు .. మరో వైపున హనుమంతుడు రూపం కలిగిన ఒకే విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షా కాలంలో ఈ ఆలయం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు ఆలయాలు కూడా ప్రశాంతతకు .. పవిత్రతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. భక్తుల అంకితభావానికి అద్దం పడుతుంటాయి. రహదారి పక్కనే ఉండటం వలన అటుగా వెళ్లే వాళ్లు .. వచ్చే వాళ్లు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ వుంటారు.

Discussion4 Comments

  1. I discovered your blog site on google and check a few of your early posts. Continue to keep up the very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on!…

  2. Pingback: invitro biowaiver studies

  3. Pingback: hdr china

  4. Pingback: Free porn videos

Leave A Reply