జయదేవుడు

0 266

జయదేవుడు ‘గీత గోవిందాన్ని’ రచిస్తునప్పుడు పరమాత్ముడైనటు వంటి శ్రీకృష్ణుడు, అనేక లీలావిశేషాలను ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడి అనుమతితోనే .. ఆయన అనుగ్రహతోనే తాను గీత గోవిందాన్ని రాశాననీ, అసలు ఆయనే తనతో రాయించాడని భావించాడు. పరమభక్తితో ఆయన రాసినటువంటి కావ్యం పట్ల కాశీ పండితులు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు.
శృంగార రసంతో నిండినటువంటి కావ్యానికి తమ ఆదరణ లభించదంటూ అసహనాన్ని ప్రదర్శిస్తారు. అంతే కాకుండా ఆ కావ్యాన్ని తీసుకుని ఆయన ఎదురుగానే గంగానదిలోకి విసురుతారు. ఆ సంఘటన జయదేవుడిని ఎంతగానో బాధపెడుతుంది. శ్రీకృష్ణుడు విని మురిసిపోయిన కావ్యాన్ని వాళ్లు అలా గంగపాలు చేయడం తనకి జరిగిన అవమానంగా జయదేవుడు భావించడు. తనకి ప్రాణప్రదమైన ఆ కావ్యం దూరం కావడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోతాడు.
తన కావ్యాన్ని తనకి చేర్చమంటూ గంగాదేవిని ప్రార్ధిస్తాడు. అప్పుడు గంగాదేవి స్వయంగా ఆ తాళ పత్రాలను తీసుకుని వచ్చి ఆయనకి అందిస్తుంది. ఆనందంతో ఆ తాళ పత్రాలు అందుకుని తన ప్రార్ధనని ఆలకించి అనుగ్రహించిన గంగాదేవికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు అక్కడుకున్న పండితులకు ఆ కావ్యం యొక్క గొప్పతనం అర్థమవుతుంది.

Leave A Reply

Your email address will not be published.