జాతక రీత్యా గృహాలంకరణ

1

గృహప్రవేశమైన తర్వాత ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. గృహప్రవేశానికి ముందు రంగు వేయించినా తర్వాత మళ్లీ సరిగ్గా వేయించుకుంటాం కొందరు ముందే సరిగా వేయిస్తారు. కొందరికి ఆ సమయం కూడా ఉండదు.
ఇలాంటి సమయాల్లో మళ్లీ సున్నం వేయాలి కనుక కొన్ని జాగ్రత్తలతో వేస్తే సరిపోతుంది. ఇంటికి తెల్ల సున్నం వేయించుటలో తప్పులేదు. కాని ఇంటి పెద్ద జాతక రీత్యా లగ్నాధిపతి ఏ గ్రహముతో కలసి ఉంటాడో చూసుకుని రంగు వేయించడం వల్ల ఆ గృహాధిపతికి అనుకూలత ఏర్పడి మంచి శుభములు జరుగగలవు.
తూర్పు వైపు గృహమునకు తెల్ల రంగు మరియు పసుపు, దక్షిణ వైపున అయితే ఎరుపు రంగు, పశ్చిమ వైపున అయితే నీలి రంగు, ఉత్తరం వైపు ఆకుపచ్చని రంగులు వేస్తే మంచిది. ఇంటికి ఇష్ట దైవం పేరు పెట్టుకోవచ్చు. పేరు పక్కనపెట్టే భవనము అంటే బాలురు గలదని, నిలయము అంటే నిధులు కలదని అర్థము.
ఉత్తరమున తల పెట్టి పడుకోకూడదు. ముఖ ద్వారానికి ఎదురుగాను, దూలానికి వెన్ను కింద భాగంలోనూ తలపెట్టి పడుకోరాదు. తూర్పు వైపు తిరిగి భుజించే విధంగా డైనింగ్ టేబుల్ ఉండాలి. ఇంట్లో ప్రతి గదిలోనూ ఈశాన్యం మూల ఖాళీగా ఉండుట మంచిది వీలు అయ్యినంతవరకూ ఏ వస్తువు అక్కడ పెట్టకుండా వుండుట మంచిది. గోడకు కూడా వస్తువులను పాత బట్టలను తగిలించకూడదు. ఇంటి ఆవరణలో చెట్లు పెంచేటట్టయితే వాటి నీడ ఇంటి మీద పడకుండా ఉండేట్టు చూడాలి.
ఇంటి స్థలం కోసం వెళ్లే సమయంలో శకునాల జాగ్రత్తలు
ఇంటిలో గది నిర్మాణాల విషయంలోనే కాక నిర్మాణ పనులు ప్రారంభించే ముందు కూడా వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి స్థలం చూసేందుకు వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే శకునం కుడా ఆ ఇంటిలో మనకు ఎదురయ్యే అనుభవాలకు కారణంగా నిలుస్తుంది.
తాపీ మేస్త్రీని ఇంటి నిర్మాణ స్థలానికి తీసుకుని వెళ్లే సమయంలో నుదుట కుంకుమ తిలకం, జడ నిండా పువ్వులు, మెడలో మాంగల్య సూత్రం కలిగిన ఓ నిండు సుమంగళి ఎదురుగా వస్తే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.ఈ రకమైన శకునంతో పనులు ప్రారంభిస్తే ఆ ఇంటిలో నివసించే వారు సకల సౌభాగ్యాలతో కలకాలం విలసిల్లతారని శాస్త్రంలో చెబుతున్నారు. అలాగే కొత్త ఇంటికి శంకు స్థాపన చేసే సమయంలో నీళ్లు లేక పాలతో నిండిన కుండ, అలాగే పెరుగు కుండను మోసుకొచ్చే మహిళలు (వాటిని తీసుకొచ్చే వాహనాలైనా సరే) కూడా మంచి శకునాలు కావచ్చు.